‘ఈద్’కు వెళ్లి వస్తుండగా ఇజ్రాయెల్ దాడులు

గాజా : గాజాలో ఈద్ వేడుకల నుండి తిరిగి వస్తున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే పిల్లలు, మనవళ్లతో సహా 14 మంది చనిపోయారు. మృతి చెందిన వారిలో హనియా ముగ్గురు పిల్లలు, ముగ్గురు మనుమలు ఉన్నారు. వాహనంలో ప్రయాణిస్తుండగా షాతీ శరణార్థి శిబిరం సమీపంలో ఇజ్రాయెల్ దాడి జరిగింది. కుటుంబ సభ్యుల మృతిని హనియా ధృవీకరించారు. నలుగురు చిన్నారుల్లో ముగ్గురు అమీర్, హసీమ్, మహ్మద్ మృతి చెందారు. హజీమ్ కూతురు, వారితో పాటు ఉన్న అమీర్ కొడుకు, కూతురు చనిపోయారు.

కైరోలో అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇస్మాయిల్ హనియే హమాస్ రాజకీయ వ్యవహారాల విభాగానికి అధిపతి. ప్రస్తుతం ఖతార్‌లో ఉన్న ఆయన ఈ ఘటనపై మాట్లాడుతూ… ”పాలస్తీనా ప్రజల రక్తం కంటే నా బిడ్డల రక్తం విలువైనది కాదు. అందుకే కుటుంబాన్ని హతమార్చడం ద్వారా హమాస్ పరిస్థితి మారుతుందని ఇజ్రాయెల్ లెక్కగడితే అది తప్పు” అని హనియా అన్నారు. 900 మంది పాలస్తీనియన్ల విడుదలకు బదులుగా 40 మంది బందీలను విడుదల చేస్తామని హమాస్ హామీ ఇచ్చింది. గాజాలో వెంటనే కాల్పుల విరమణ ఉండదు. అలా చేయడం హమాస్‌కు లొంగిపోయినట్లే అవుతుందని ఇజ్రాయెల్ ప్రధాని గత ఏడాది చివర్లో అన్నారు.

ఆరు నెలల ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం :

ఇజ్రాయెల్ మొత్తం హమాస్ నాయకత్వాన్ని తీవ్రవాదులుగా పరిగణిస్తుంది. హనియే, ఇతర నాయకులు “హమాస్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వారుగా” ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ సంస్థ పాలస్తీనియన్ల మరణాలపై తాజాగా నివేదికను విడుదల చేసింది.

అక్టోబర్ 10, 2023 – ఏప్రిల్ 8, 2024 – గాజాలో పాలస్తీనియన్ల అనేక మంది మరణించారు. గాయాలు పాలైయ్యారు.
పాలస్తీనా మరణాల సంఖ్య 33,000 దాటింది. వీరిలో దాదాపు 14,500 మంది పిల్లలు, 9,500 మంది మహిళలు మరణించారని తెలుస్తోంది.
అదనంగా 7,000 కంటే ఎక్కువ మంది తప్పిపోయినట్లు లేదా శిథిలాల కింద ఉన్నట్లు నివేదించబడింది.

➡️