27 నుంచి జగన్‌ మూడోవిడత యాత్ర?

Apr 25,2024 16:42 #cm jagan
  • 15 రోజులు : 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్‌మ్యాప్
    అమరావతి : వైసిపి అధినేత, రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడో విడత ఎన్నికల యాత్రను చేపట్టనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే ‘సిద్ధం’ పేరిట నాలుగు భారీ బహిరంగ సభలు, 22 రోజులపాటు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ఈనెల 24 వరకూ చేపట్టిన విషయం తెలిసిందే. గురువారంనాడు పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా వైసిపి తరపున ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. రెండు, మూడు రోజుల్లో వైసిపి మూడో విడత ఎన్నికల ప్రచారం చేపట్టనున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఈ నెల 27 లేదంటే 28 తేదీ నుంచి సీఎం జగన్‌ ఎన్నికల సభల్లో పాల్గనేలా వైఎస్సార్‌సీపీ కార్యాచరణ రూపొందించినట్లుగా సమాచారం. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో.. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్‌మ్యాప్‌కు వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. ప్రతిరోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ మధ్యలోనే ఆయన వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
➡️