ఏపీ కాంగ్రెస్ కీలక నిర్ణయం

ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ  114 ఎమ్మెల్యే, 5 ఎంపీ అభ్యర్థుల పేర్లకు ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది. మిగతా పేర్లను త్వరలోనే ఆమోదించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తొలి జాబితా మంగళవారం విడుదల అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పేర్కొంది.  ఏపీలో పెన్షన్ల విషయంలో ఉద్దేశపూర్వక జాప్యం జరుగుతుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి  పేర్కొన్నారు. తద్వారా అధికార పార్టీకి మేలు కలిగేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జాప్యానికి ప్రతిపక్షాలే కారణం అన్న కోణంలో ప్రజలకు చెబుతున్నారని తెలిపారు. డిబిటి విధానంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి పెన్షన్ సొమ్ము వేయాలని ఈసీ ఆదేశించిందని వెల్లడించారు. ఒక రోజులో జరిగే పనికి పది రోజుల సమయం ఎందుకని ప్రశ్నించారు. చీఫ్ సెక్రటరీ చొరవ తీసుకుని డిబిటి ద్వారా వెంటనే పంపిణీ చేయాలని అన్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్ తరపున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

➡️