అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Nov 24,2023 17:16 #Crimes in AP, #Kurnool

ప్రజాశక్తి-దేవనకొండ : కర్నూల్ జిల్లా దేవనకొండ మండల పరిధిలోని గుడిమిరాళ్ల గ్రామంలో ఓ వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొల్ల ప్రకాష్ అనే వ్యక్తి గత12 ఏళ్ల క్రితం ఆదోని మండలం ఆరెకల్ గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మీదేవితో వివాహమైంది. వారికి ఒక కూతురు, ఇద్దరు కుమారులు కలరు. వారి దాంపత్యం సాఫీగానే సాగింది. అయితే గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మృతురాలు లక్ష్మీదేవి(32) ఇంటి ఆవరణలో అగ్నికి అహుతయింది. అయితే భర్త ప్రకాష్ పెట్రోల్ పోసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మృతురాలి భర్త ప్రకాష్ పై 306 సెక్షన్ కింద అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భూపాలుడు తెలిపారు.

➡️