వికసించిన మే పుష్పం

May 19,2024 08:51 #May flower

ప్రజాశక్తి- సీలేరు (అల్లూరి జిల్లా) : మే పుష్పం అంద చందాలు చూపరుల మనసు హత్తుకుంటున్నాయి. జికె వీధి మండలం సీలేరు ఎపి జెన్‌కో కాలనీ రిటైర్డ్‌ ఉద్యోగి సిద్ధార్థ కుమార్‌ ఇంటిలో మే పుష్పం ఎరుపు, తెలుపు రంగు వర్ణంలో వికసించింది. ఇది పలువురు మదిని దోచుకుంటుంది. ప్రతి ఏడాది మే మొదటి వారం నుంచి నెల చివర వరకు ఈ పుష్పం వికసిస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ మొక్క ఏపుగా ఎదిగి గుత్తులు గుత్తులుగా మే పుష్పాలు విరబూశాయి. సీలేరు వాసులు దీన్ని తిలకించి మంత్రముగ్ధులవుతున్నారు.

➡️