ఎన్నికల తరువాత బిజెపిలో టిడిపి విలీనం – మంత్రి అంబటి రాంబాబు

Capital of Amaravate Ambati Rambabu

ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ (పల్నాడు జిల్లా) :సార్వత్రిక ఎన్నికల అనంతరం చంద్రబాబు జైలుకెళ్తారని, బిజెపిలో టిడిపిని వీలీనం చేస్తారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వైసిపి కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. పోలవరాన్ని ఎటిఎంలా చంద్రబాబు వాడుకోవడం వల్లే అది పూర్తి కాలేదన్నారు. పోలవరంపై చర్చకు సిద్ధమా? అని చంద్రబాబుకు సవాలు విసిరారు. గతంలో చంద్రబాబును కన్నా లకీëనారాయణ నానా తిట్లు తిట్టలేదా? అని ప్రశ్నించారు. అన్ని పార్టీలకూ కన్నాలు వేసి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ ఏదో ఒకనాడు టిడిపికి కూడా కన్నం వేస్తారని ఎద్దేవా చేశారు. మేము వదిలేస్తేనే లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి మీ చంకనెక్కారని అన్నారు. పవన్‌కల్యాణ్‌ రెండు రోజులు ప్రచారం చేసి ఐదు రోజులు జ్వరమంటూ పడుకుంటున్నారని, తాను పండగలకు సంతోషంతో డ్యాన్సులు వేస్తే.. పవన్‌ కల్యాణ్‌ డబ్బులు తీసుకుని డ్యాన్స్‌లు వేస్తున్నారని అన్నారు. యువగళం పేరుతో రాష్ట్రమంతా తిరిగిన లోకేష్‌ ఇప్పుడు మంగళగిరికే పరిమితమయ్యారని విమర్శించారు.

➡️