MLC Kavitha సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ను వెనక్కు తీసుకున్న కవిత

తెలంగాణ : ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ … సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే కవితను అరెస్టు చేసింది. ఇక ఈ పిటిషన్‌పై విచారణ అవసరం లేకపోవడంతో దానిని వెనక్కి తీసుకుంటున్నట్లు కవిత తరపు న్యాయవాది విక్రమ్‌ చౌదరి తెలిపారు. పిటిషన్‌ ఉపసంహరణకు జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం అనుమతించింది. తాము చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళతామని చౌదరి తెలిపారు. ఈడీ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ.. గత ఏడాది మార్చి 14న సుప్రీంకోర్టులో కవిత ఈ పిటషన్‌ దాఖలు చేశారు.

➡️