నేడు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మోస్తరు వానలు

May 12,2024 12:31 #13, #districts, #Moderate rains, #State, #today

విశాఖపట్నం : నేడు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ మాట్లాడుతూ … రాష్ట్రంలో రానున్న 5 రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కఅష్ణా, ఎన్‌టిఆర్‌ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఆదివారం కురుస్తాయని తెలిపారు. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వాన కురుస్తుందన్నారు.

➡️