నేడు తెలంగాణకు రాహుల్‌ గాంధీ

May 5,2024 10:01 #paryatana, #Rahul Gandhi

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీల కీలకనేతలందరూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ పార్లమెంట్‌ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా, ఎన్నికల ప్రచారంపై మరింత దృష్టిసారించిది. ప్రచారంలో మరింత జోష్‌ పెంచడానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మే 10వ తేదీ వరకు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈరోజు ఉదయం నాంధేడ్‌ నుంచి నేరుగా నిర్మల్‌లో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు రాహుల్‌ గాంధీ హాజరు కానున్నారు. అక్కడ అదిలాబాద్‌ అభ్యర్ధి ఆత్రం సుగుణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఆ తరువాత అక్కడి నుంచి నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని అలంపూర్‌ ఎర్రవల్లి కూడలి వద్ద జరగనున్న ఎన్నికల ప్రచార సభకు సాయంత్రం 5 గంటలకు హాజరవుతారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. తిరిగి ఈ నెల 9న ఉదయం కరీంనగర్‌, సాయంత్రం 5 గంటలకు సరూర్‌ నగర్‌లో రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తారు.

➡️