హైదరాబాద్ : తెలంగాణ సిఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో సిఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎంగా భట్టి విక్రమార్కలతో రాష్ట్ర గవర్నర్ తమిళసై ప్రమాణ స్వీకారం చేయించారు. వారితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజనర్సింహ, శ్రీధర్ బాబు, సీతక్క, సుదర్శన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు లు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖడ్గేలు హాజరైయ్యారు.
![revanth reddy as ts cm oath](https://prajasakti.com/wp-content/uploads/2023/12/revanth-reddy-as-ts-cm-oath.jpg)