శ్రీవారి ఆలయాన్ని రక్షించండి : రమణ దీక్షితులు

Nov 27,2023 20:35 #Tirupati, #ttd

ప్రజాశక్తి- తిరుమల: తిరుమల క్షేత్రం హిందూయేతర ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉందని, శ్రీవారి ఆలయాన్ని రక్షించాలని ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఎపి ప్రభుత్వంపై ప్రధానమంత్రికి శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఫిర్యాదు చేశారు. క్రమపద్ధతిలో హిందూ దేవాలయాలను, పురాతన సంప్రదాయాలు, నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని పేర్కొన్నారు. ఇంతకాలం హైందవ సనాతన ఆస్తిగా టిటిడిలో అంతర్భాగంగా ఉన్న ఆలయ సంపదను నామరూపాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. దయచేసి తిరుమల క్షేత్రాన్ని రక్షించి వెంటనే తెలుగు నెలపై హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలని ట్విట్టర్‌లో మోడీని రమణదీక్షితులు కోరారు.

➡️