కదం తొక్కిన విద్యార్థులు

Dec 1,2023 10:58 #Education Department, #SFI

 ఫలించిన ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్‌ యాత్ర, దీక్షల పోరాటం

స్థానిక సమస్యలు పరిష్కరిస్తాం : ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ

6న విద్యాశాఖ అధికారులతో చర్చలకు హామీ

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ :   విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన గతంలో సైకిల్‌యాత్ర చేపట్టిన విద్యార్థులు ఇటీవల వారం రోజుల పాటు కలెక్టరేట్‌ వద్ద నిరాహారదీక్షలు చేపట్టారు. గురువారం చేపట్టిన మహాధర్నాకు అధికారులు స్పందించి జిల్లాలోని విద్యారంగ సమస్యపై డిసెంబర్‌ 6న శాఖ అధి కారులతో చర్చించి, స్థానికంగా ఉన్న సమస్యలను సత్వర మే పరిష్కారానికి హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనను విరమించారు. తొలుత ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌ టిసి కాంప్లెక్స్‌ నుంచి మెయిన్‌ రోడ్డు మీదుగా కలెక్టరేట్‌ వరకూ పెద్ద ఎత్తున విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, అనం తరం కలెక్టరేట్‌ ఆవరణలో ధర్నా చేపట్టారు. ధర్నానుద్దే శించి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రకమిటీ సభ్యులు సిహెచ్‌.వెంకటేష్‌ మాట్లాడుతూ విద్యాశాఖ ఉన్నతాధికారులు సంక్షేమ హాస్టళ్లకు, విద్యాసంస్థలను సందర్శించే పరిస్థితి లేదని, ఆ పని ఎస్‌ఎఫ్‌ఐ చేస్తూ పరిశీలించిన సమస్యల్ని పరిష్కారం చేయాలంటే అధికారులు ముందుకు రాకపోవడం దుర్మార్గమని అన్నారు. కనీసం విద్యార్థులకు మరుగుదొడ్లు కూడా లేకపోవడం బాధాకరమని, వసతిగృహాలకు సొంత భవనాల్లేక చాలీచాలని గదుల్లో కొట్టుమిట్టాడుతున్న పరి స్థితి జిల్లాలో ఉందని తెలిపారు. విద్యార్థులు కోరుతుంది గొంతమ్మ కోరికలు కావాలని, వారి విద్యాభివృద్ధికి చేస్తున్న పోరాటాలని, వాటిని వెంటనే పరిష్కరించాలని చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.పండు, పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ పోరాటమే సరైన మార్గమన్న నినాదం ఈ పోరాటం ద్వారా రుజువైందని అన్నారు. జిల్లా ఏర్పడి రెండేళ్లవుతున్నా కనీసం మౌలికసదుపాయాలు కల్పించకపోవడం దారుణమని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అందించే అరకొర మెస్‌ చార్జీలతో విద్యార్థులకు పౌష్టికమైన ఆహారం అందడం లేదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలని, బకాయి మెస్‌ బిల్లులు విడుదల చేయాలని, పార్వతీపురంలో గల బిసి, ఎస్‌సి పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్లకు సంత భవనాలు ఏర్పాటు చేయాలని, సాలూరు పోస్టు మెట్రిక్‌ బార్సు హాస్టలుకు రోడ్‌ సౌకర్యం కల్పించాలని, గర్ల్స్‌ పోస్ట్మెట్రిక్‌ హాస్టల్‌కు, పాలకొండ పోస్ట్మెట్రిక్‌ హాస్టలకు సొంత భవనాలు నిర్మించాలని, వీరగొట్టం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని, పార్వతీపురంలో మెడికల్‌, ఐటిఐ, పిజి, సాలూరులో బిఇడి, పాలకొండలో పిజి గుమ్మలక్ష్మీపురం డైట్‌ కళాశాలలు నిర్మించాలని, కురుపాం ఇంజనీరింగ్‌ కళాశాల భవనం పనులు పూర్తి చేయాలని, గరుగుబిల్లి, సీతంపేట మండలాల్లో జూనియర్‌ కళాశాలలు నిర్మాంచాలని, బలిజిపేట, కురుపాం, భామిని, పాచిపెంట మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు నిర్మిం చాలని, కొమరాడ, సీతానగరం, వీరఘట్టాం, మక్కువ, పాచిపెంట, భామిని, బలిజిపేట మండలాల్లో పోస్టు మెట్రి క్‌ హాస్టళ్లను నిర్మించాలని, పాలకొండ డిగ్రీ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని, సాలూరు కేంద్రంలో ఆశ్రమ పాఠశాల నిర్మించాలని, పాఠశాల, సంక్షేమ హాస్టళ్లకు సరి పడ్డ పర్మినెంట్‌ వర్కర్స్‌, వార్డలను నియమించాలని డిమాండ్‌ చేశారు.

ఈ డిమాండ్లపై స్పందించిన జాయిం ట్‌ కలెక్టర్‌ గోవిందరావు, డిఆర్‌ఒ ఇంచార్జ్‌ తో స్పష్టమైన హామీ, చర్చలు జరిపేందుకు తేదీ తెలియజేయక పోవ డంతో విద్యార్థులంతా ఆగ్రహించి, కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలోనే బైఠాయించారు. పోలీసులకు, విద్యార్థులకు కొంత ఘర్షణ జరిగిన అనంతరం, డిసెంబర్‌ 6 బుధవారం విద్యాశాఖ సంబంధిత అధికారులతో చర్చలకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను ఆహ్వానిస్తున్నట్టు ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ కేశవ నాయుడు ద్వారా సమాచారాన్ని అందించారు. పోరాట విజయంగా భావించి విద్యార్థులు ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు కె.రాజు, సింహాచలం, గంగారాం, వరుణ్‌ పెద్దఎత్తున విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️