రాష్ట్ర వ్యాప్తంగా ‘చలో ఢిల్లీ’కి సంఘీభావం

ప్రజాశక్తి-యంత్రాంగం : సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేతృత్వంలో కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదాన్‌లో జరగనుంది. చలో ఢిల్లీ కార్యక్రమానికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో సంయుక్త కిసాన్ మోర్చా (SKM) – కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఢిల్లీలో పోరాడుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావంగా విశాఖలో సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన సంఘీభావ కార్యక్రమంలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు

 

ఏలూరు జిల్లా – కొయ్యలగూడెం : రైతు కూలి సంఘం, సిఐటియు, ఎఐటిసి, ఐఎఫ్టియు, సిపిఎం, సిపిఐ, సిపిఎంల్ న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొయ్యలగూడెం తాశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు పి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఢిల్లీ రామ్ లీలా మైదానంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం) పంటల మద్దతు ధర చట్టం, రుణ విమోచన చట్టం మాత్రమే రైతులకు ఉపశమనాన్ని కలిగిస్తాయని కానీ బిజెపి ప్రభుత్వం మొత్తం వ్యవసాయ రంగాన్నే కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు కంకణం కట్టుకుంది కావున రాబోయే ఎన్నికల్లో మోడీ నాయకత్వాన ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని దాని మద్దతు దారులను ఓడించడం ద్వారానే అవసరమైన చట్టాలను సాధించుకోగలం వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని కాపాడుకోగలం అని అన్నారు.

 

నిరంకుశ బిజెపిని గద్దె దించడమే లక్ష్యం

అన్నమయ్య జిల్లా – రాజంపేట అర్బన్ : నిరంకుశ బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ఇందుకు కార్మిక, కర్షక, ప్రజాసంఘాలు కలిసి రావాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్మెస్ రాయుడు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి ఈ.సికిందర్ లు పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం జాతీయ రహదారిలో గల ఎన్టీఆర్ కూడలి వద్ద ప్రజాసంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ నిరసన తెలియజేశారు.

అనకాపల్లి జిల్లాలో….

 

May be an image of 9 people and text

భీమవరంలో….

రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి

శ్రీకాకుళం జిల్లా – రణస్థలం : కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ డిమాండ్ చేసారు.‌ కేంద్ర బిజెపి ప్రభుత్వ రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతుల ఛలో ఢిల్లీకి మద్దతు తెలుపుతూ రణస్థలంలో రామతీర్థాలు జంక్షన్ వద్ద సిఐటియు, ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం 2021 డిసెంబర్ లో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు పరచాలని కోరుతూ ఢిల్లీ బయలుదేరిన రైతాంగాన్ని హర్యానా సరిహద్దులలోనే అడ్డగించి, కందకాలు తవ్వడం, మేకులు నాటడం, బారికేడ్లు, ముళ్ళకంచెలు ఏర్పరచడం, వాటర్ క్యాన్లు ప్రయోగించడం, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడంతోపాటు డ్రోన్ల ద్వారా విష వాయువులు చిమ్మించిందని అన్నారు. ఈ చర్యల వల్ల అనేకమంది రైతులకు కళ్ళు చూవు కోల్పోవడం, చెవులు వినపడకపోవడం జరిగిందని, కాల్పులలో యువరైతు మృతి చెందాడు, మరొక ముగ్గురు రైతులు గుండె ఆగి చనిపోయారు. ఈ దాడిలో 200 ట్రాక్టర్లు ధ్వంసం అయ్యాయి. ఈ దురాగతాన్ని హర్యానా బిజెపి ప్రభుత్వ, పోలీసులు, కేంద్ర ప్రభుత్వ బలగాలు పంజాబ్ సరిహద్దుల లోపలకు చొరబడి నిర్వహించాయని దుయ్యబట్టారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం 26 వేల రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేసారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని, కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం చేయాలని డిమాండ్ చేసారు. మొత్తం వ్యవసాయ రంగాన్ని అదానీ, అంబానీ తదితర కార్పొరేట్ కంపెనీల హస్తగతం చేయడానికి కంకణం కట్టుకుందని, ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు కూడా అలాగే ఉన్నాయని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ ఎరువులపై సబ్సిడీలు కోత విధించడం, ఆహారభద్రత చట్టం అమలుకు నిధులలో కోత విధించడం చేసారని అన్నారు. బిజెపిని ఇంటికి సాగనంపి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, మహాలక్ష్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.

చిన చామలాపల్లిలో నిరసన

విజయనగరం జిల్లా – గజపతినగరం : దేశవ్యాప్త పిలుపులో భాగంగా రైతు సంఘాల సమైక్య సమితి, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా చిన చామలాపల్లి గ్రామంలో నిరసన కార్యక్రమం జరిగింది. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి సూర్యనారాయణ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతులకు నష్టం తెచ్చే విధానాలు అమలు చేస్తున్నారు. గిట్టుబాటు ధర చట్టం తెస్తామని స్వామినాథన్ సిఫార్యులు అమలు చేస్తామని ఇచ్చిన హామీని పక్కన పెట్టేశారు. నల్ల చట్టాలను దొడ్డి దారిన అమలు చేస్తూ రైతన్న హత్యలను పెంచే విధంగా పాలన చేస్తున్నారు. ఉపాధి హామీ చట్టాలను నీరుగారిస్తున్నారు కార్మిక కోడ్లు తెచ్చి కార్మిక హక్కులు కాలరాస్తున్నారు. పేదలకు భూములు పట్టాలు ఇవ్వకపోగా గిరిజనులు పేదలు భూములు కార్పొరేటర్లకు అప్పగించి కుట్రలు పూనుకున్నారు. రైతు రుణమాఫీ వేయడంలేదు కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయడం లేదు ప్రభుత్వానికి సంస్థలు ప్రైవేటీకరణ చేసి ప్రజల ఆస్తి ప్రైవేట్ పరం చేసి ప్రజలకు నష్టం తెచ్చి పెడుతున్నారు. కావున మోడీ ప్రభుత్వం రైతు రక్షణకు మద్దతు ధర చట్టం తేవాలి. రుణమాఫీ చేయాలి సమగ్ర పంటల భీమా పథకం పెట్టాలి ఉపాధి హామీకి రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి 200 రోజులు పని కల్పించి 600 రూపాయలు కూలి గిచ్చిబౌట్ చేయాలి. కార్మిక కోడ్లు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తు కోసం ప్రజానీకం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు.

విశాఖ : సిఐటియు ఆధ్వర్యంలో ఢిల్లీ రైతుల పోరాటానికి మద్దతుగా విశాఖలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నరసింహారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్కే ఎస్ వి కుమార్, జగదాంబ జోన్ కార్యదర్శి ఎం సుబ్బారావు, వై రాజు, మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

➡️