టిడిపిలో చేరతా.. ఎంపి మాగుంట వెల్లడి

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : తాను టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. తన కుటుంబంతో పాటు అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా పార్టీలో చేరతారని చెప్పారు. టిడిపి, జనసేన జిల్లా నేతలతో ఆయన తన నివాసంలో కీలకభేటీ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి అధినేత చంద్రబాబుతో మాట్లాడాక పార్టీలో ఎప్పుడు చేరేది నిర్ణయం తీసుకుంటానన్నారు. తన కుమారుడు రాఘవరెడ్డిని ఎంపిగా పోటీ చేయిస్తానని తెలిపారు. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్థన్‌ మాట్లాడుతూ.. మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీలోకి రానుండడం సంతోషమన్నారు. గతంలో ఆయన పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని గుర్తు చేశారు. మాగుంట కుటుంబాన్ని పార్టీ నేతలందరూ సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

➡️