టెక్కలిలో రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు

Apr 1,2024 12:57 #One day classes, #SFI, #srikakulam

రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రామ్మోహన్ రావు
ప్రజాశక్తి-టెక్కలి : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రామ్మోహన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి చందు బి హరీష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు లోగోను ఆవిష్కరించారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రామ్మోహన్ రావు మాట్లాడుతూ విద్యారంగంలో ఉండే సమస్యల పైన విద్యార్థుల యొక్క హక్కుల కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నాటి నుంచి నేటి వరకు కూడా అలుపెరిగిన పోరాటం చేస్తుంది అని చెబుతూ, దేశంలో మతోన్మాద శక్తులను తరిమికొట్టి దేశంలో లౌకిక ప్రజాస్వామ్య విలువలను కాపాడగలిగేది కేవలం విద్యార్థులు మాత్రమే అని అన్నారు. ఇటీవల కాలంలో జె.ఎన్.యు యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ విజయ దుందుభి మోగించి బిజెపి ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులను దేశం నుంచి ఇది ఒక ఆరంభం మాత్రమేనని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథంతో కూడినటువంటి విద్య అందిస్తూ వారిలో సృజనాత్మక శక్తిని వెలుగు చేసేందుకు ఈ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ శిక్షణా తరగతులు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో ప్రణవి డిగ్రీ కాలేజ్ లో నిర్వహిస్తామని చెప్పారు. ఈ శిక్షణ తరగతులకు రాష్ట్ర నలుమూలల నుండి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నాయకులు, కార్యకర్తలు దాదాపుగా 600 మంది హాజరవుతారని ప్రకటించారు. ప్రముఖ నిష్ణాతులైన ప్రొఫెసర్లతో విద్యార్థులకు నేటే సమాజంలో జరుగుతున్న సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని అన్నారు. ఈ శిక్షణ తరగతులకు అభ్యుదయ వాదులు, మేధావులు ఎస్ఎఫ్ఐ అభిమానులు అందరూ ఆర్థిక హార్దిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

➡️