సర్పంచుల “చలో అసెంబ్లీ”పై నిర్భంధాలు

Feb 6,2024 08:20 #arrest, #Protest, #sarpanches

ప్రజాశక్తి-యంత్రాంగం : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి సర్పంచుల 16డిమాండ్ల పరిష్కారం కొరకు 6న “చలో అసెంబ్లీ” కార్యక్రమం చేపట్టింది. అసెంబ్లీని ముట్టడించి తమ హక్కుల సాధనలో భాగస్వాములు కావాలని సర్పంచ్ సంఘాలు పిలుపునిచ్చాయి.  ఈ క్రమంలో సోమవారం ఉదయం నుండే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు పోలీసులు నోటిసులు అందజేస్తున్నారు. మరి కొందరిని అదుపులో తీసుకున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15 ఆర్థిక సంఘం ద్వారా పంపిన 8,629 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటిని తిరిగి సర్పంచుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయాలను, వాలంటీర్లను గ్రామ పంచాయతీల, సర్పంచుల ఆధీనంలోనే పని చేయించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం గ్రామ పంచాయతీలకు ఇచ్చి  సర్పంచ్ల చేతే ఖర్చు చేయించాలని కోరారు. గతంలో మాదిరే గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

suppress on sarpanches chalo assembly b

బాపట్ల-వేమూరు : పంచాయతీ ఛాంబర్స్ మరియు సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వేమూరు నియోజకవర్గం, భట్టిప్రోలు మండల కేంద్రంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి సాయి బాబాకు పోలీసులు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి నాయకులు ఎవరు ముట్టడికి వెళ్ళకూడదని ఎలాంటి అనుమతులు లేవంటూ ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. గత నాలుగు ఏళ్ళలో గ్రామపంచాయతీలకు ఎలాంటి నిధులు లేకుండా ప్రభుత్వం బ్రష్టు పట్టించిందని, సర్పంచుల సమస్యలపై ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తే అరెస్టులు చేయించడం వైసిపి పతనానికి నాంది పలుకుతుందని సాయిబాబా పేర్కొన్నారు.

suppress on sarpanches chalo assembly c

రాష్ట్ర సర్పంచుల రాష్ట్ర కార్యదర్శి హౌస్ అరెస్ట్
తూగో – ఉండ్రాజవరం : సర్పంచుల చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని తాడిపర్రు సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబును ఆదివారం రాత్రి నుండి ఆయన ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర సర్పంచుల సంఘం పిలుపు మేరకు మంగళవారం నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడికి హాజరవుతారనే కారణంగా అయినను ముందస్తు అరెస్టు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. నరేంద్రబాబు రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

➡️