అచ్చెన్నకు మాతృవియోగం

Mar 31,2024 20:55 #acchennnaidu, #mother, #passed away

ప్రజాశక్తి- కోటబమ్మాళి (శ్రీకాకుళం జిల్లా) :టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తల్లి, శ్రీకాకుళం పార్లమెంటరీ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు నాయినమ్మ కళావతమ్మ (90) ఆదివారం మృతి చెందారు. అమె గత కొంత కాలంగా వయోభారంతో ఆనారోగ్యం బారిన పడ్డారు. శ్రీకాకుళం జిల్లా కోటబమ్మాలి మండలం నిమ్మాడలోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. కళావతమ్మకు నలుగురు కుమారులుఎర్రన్నాయుడు, హరివరప్రసాద్‌, ప్రభాకర్‌, అచ్చెన్నాయుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అమె అంత్యక్రియలు సోమవారం నిమ్మాడలో జరుగుతాయని బంధువులు తెలిపారు. కళావతమ్మ మృతిపై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్‌లు ఫోన్‌లో సంతాపం తెలిపారు. కింజరాపు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

➡️