శ్వేతపత్రం కక్ష సాధింపు లెక్కగా ఉంది : హరీష్‌ రావు

Dec 20,2023 13:48 #achievement, #brs, #Harish Rao, #white paper

తెలంగాణ : శ్వేతపత్రం కక్ష సాధింపు లెక్కగా ఉందని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు ధ్వజమెత్తారు. బుధవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో …. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై 42 పేజీలతో కూడిన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్వేత పత్రాన్ని విడుదల చేసి ప్రసంగించారు. అరగంట అనంతరం అసెంబ్లీ సమావేశం మొదలైంది.

ఎమ్మెల్యే హరీష్‌ రావు మాట్లాడుతూ … తమకు కన్వినెంట్‌ గా వైట్‌ పేపరును తయారు చేసుకున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి చేస్తున్నారని నిప్పులుచెరిగారు. ” కక్ష సాధింపు లెక్కగా ఉంది ఈ శ్వేత పత్రం ” అన్నారు. రాష్ట్ర సర్కార్‌.. శ్వేత పత్రం చూస్తుంటే.. వాస్తవాల వక్రీకరణలా ఉందన్నారు. తప్పుల తడకగా రాష్ట్ర ప్రభుత్వం వైట్‌ పేపర్‌ ఉందని మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని బధనాం చేసే ఆలోచనే కనపడుతుందన్నారు. ఆర్థిక స్థితిపై వైట్‌ పేపర్‌ ను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తయారు చేయలేదన్నారు. తెలంగాణ గత తొమ్మిదేళ్ళలలో చాలా రంగాల్లో తెలంగాణ మెరుగ్గా ఉందన్నారు. కానీ వైట్‌ పేపర్‌ లో ప్రభుత్వం తనకి అనుకూలంగా లెక్కలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు ఉన్నాయన్నారు. హౌస్‌ కమిటీ వేయండి అని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చుపై చర్చ చేద్దామన్నారు. ఇవన్నీ సిఎం పాత గురువుకి చెందిన రిటైర్డు అధికారితో రాయించారన్నారు. మాజీ ఐఏఎస్‌ రిటైర్డ్‌ అధికారితో రాయించారని తెలిపారు. ఐటి, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ … ఇచ్చిన శ్వేత పత్రలెక్కల్లో తప్పు ఉంటే చెప్పండని కోరారు. కానీ.. ఎవరి పేరునో చెప్పి తప్పుదారి పట్టించొద్దని అన్నారు. రికార్డు నుండి తొలగించాలని కోరారు. దీంతో హరీష్‌ రావు మాట్లాడుతూ.. వాళ్లకు కన్వినెంట్‌ గా తయారు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు కొలిచే విధానం ఫాలో కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారని అన్నారు. తెలంగాణ కంటే 22 రాష్ట్రాల్లో అప్పు ఎక్కువ తీసుకున్నాయన్నారు. రాజస్థాన్‌.. 5.37 లక్షల కోట్లు అప్పు చేసిందని అన్నారు. కర్నాటక కూడా 5 లక్షల కోట్లు అప్పు చేసిందని తెలిపారు. బిఆర్‌ఎస్‌ హయాంలో ఆస్తుల కల్పన చేశామన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా శ్వేత పత్రం ఉందన్నారు. బిఆర్‌ఎస్‌ హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో అధ్భుత ప్రగతి సాధించామని తెలిపారు.

➡️