నిజామాబాద్ లో విషాదం.. చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి

Apr 7,2024 13:09 #2 death, #nijamabad

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కుమ్మన్ పల్లికి చెందిన ఇద్దరు యువకులు చేరువులోని పువ్వులు తెంచడానికి వెళ్ళి మృత్యువాత పడ్డారు. సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్థుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. కాగా మృతులను మనోజ్, కుమార్ లుగా గుర్తించిన పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

➡️