టిటిడి పరువు నష్టం కేసు 27కు వాయిదా

Mar 14,2024 20:46 #court case, #temple, #ttd

ప్రజాశక్తి -తిరుపతి సిటీ : ఆంధ్రజ్యోతిపై తిరుమల తిరుపతి దేవస్థానం వేసిన పరువు నష్టం కేసు విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది. టిటిడి వెబ్‌సైట్‌లో అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించిన కథనాలపై టిటిడి కేసు పెట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో బిజెపి నేత, మాజీ ఎంపి సుబ్రమణ్యం స్వామి ఆంధ్రజ్యోతి దినపత్రికపై వంద కోట్ల పరువు నష్టం దావా కేసును దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి గురువారం తిరుపతి కోర్టుకు ఆయన హాజరయ్యారు. తదుపరి విచారణను న్యాయమూర్తి 27కు వాయిదా వేశారు.

➡️