విశాఖలో ఫ్లైఓవర్‌పై నుంచి పడి ఇద్దరు మృతి.. వీడియో ఇదిగో

May 12,2024 12:14 #2 death, #road acident, #visakhapatnam

ప్రజాశక్తి-విశాఖ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్‌ఏడి ఫ్లై ఓవర్‌ పాస్‌ వద్ద, డ్యూక్‌ బైక్‌ అదుపు తప్పి ఓవర్‌ పాస్‌ గోడను ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాలిలో ఎగిరి.. ఓవర్‌ పాస్‌ నుండి కిందకు పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పటికే సోషల్‌ నెట్‌వర్క్‌లలో వైరల్‌గా మారింది. ప్రమాదానికి గురైన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

➡️