ప్రకాశం జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 13 మందికి గాయాలు

Feb 4,2024 14:08 #ongle, #road accident

ప్రజాశక్తి-హనుమంతునిపాడు : ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం వేములపాడు వద్ద ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్‌రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు బస్సుల్లో ఉన్న 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

➡️