ఎపిలో నిరుద్యోగం అత్యధికం : లోకేశ్‌

అమరావతి : దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎపిలో నిరుద్యోగం అత్యధికమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఈ మేరకు లోకేశ్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 24 శాతానికి పెరగడం దురదృష్టకరమన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో వర్థిల్లిన రాష్ట్రాన్ని జగన్‌ నాశనం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యువత నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోందని అన్నారు. అన్ని అర్హతలు ఉన్న ఎపి యువత భవిత మెరుగుపడాలని లోకేశ్‌ ఆశించారు.

➡️