వర్ర రవీందర్‌ రెడ్డితో నాకు ప్రాణహాని : పోలీసులకు వైఎస్‌ వివేకా కుమార్తె సునీత ఫిర్యాదు

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత గచ్చిబౌలి సిసిఎస్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. వర్ర రవీందర్‌ రెడ్డి అనే వ్యక్తి తనను, తమ బంధువులను ఫేస్‌బుక్‌, సోషల్‌ మీడియా వేదికగా దూషిస్తూ చంపుతానని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ డిసిపి శిల్పవల్లి తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డిసిపి వెల్లడించారు.

➡️