పిఠాపురంలో వైసిపి అభ్యర్థి కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఓటర్లు

ప్రజాశక్తి పిఠాపురం : పిఠాపురం వైసిపి అభ్యర్థి వంగా గీత కార్యాలయాన్నీ ఓటర్లు చుట్టూ ముట్టారు. కొంత మందికే డబ్బు ఇచ్చారని.. తమకు డబ్బులు అందలేదని ఆందోళన చేశారు. కొత్తపల్లి మండలంలోని కొండెవరం గ్రామ ఓటర్లతో పాటు, పట్టణంలోని పలు వార్డుల్లోని ఓటర్లు ఆటోలో సైతం అక్కడికి చేరుకున్నారు. వైసిపి నాయకులు వారికి సద్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న తమకు డబ్బులు ఇచ్చి తీరాల్సిందే అని భీష్మించుకుని కూర్చున్నారు. తమ గ్రామంలో వార్డులో కొంత మందికి డబ్బులు ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదన్నారు. ఇస్తే అందరికి ఇవ్వాలి.. లేకుంటే ఎవ్వరికీ ఇవ్వకూడదని వాగ్వాదానికి దిగారు. వైసిపి కార్యాలయానికి ఓటర్లు చేరుకున్న విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. అయిన సరే ఓటర్లు మరల వైసిపి కార్యాలయానికి చేరుకుని నాయకులతో వాగ్వాదాని దిగారు.

➡️