ఆశాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం

Feb 8,2024 11:18 #Asha Workers, #cpm baburao, #Dharna
  •  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్‌.బాబురావు

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు, సిఐటియు, సిపిఎం నాయకులను పోలీసులు అరెస్టులు చేయ్యడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌. బాబురావు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఆశా కార్మికుల కోర్కెల పరిష్కారానికై ఆందోళనకు సిఐటియు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాత్రి నుండే విజయవాడ, ఎన్టీఆర్‌ జిల్లాలో పలువురు ఆశా కార్యకర్తలు, యూనియన్‌ నేతలను పోలీసులు అరెస్టులు చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించారని మండిపడ్డారు. సిఐటియు, సిపిఎం నేతలు, మహిళా నేతల ఇళ్ల వద్ద పోలీసుల పహరా కాస్తున్నారన్నారు. పలువురిని హౌస్‌ అరెస్ట్‌ చేశారని.. బయటికి వస్తే అరెస్ట్‌ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నార ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్బంధాలపై వచ్చే ఎన్నికలో ఆశాలు, ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు.

➡️