పైలట్‌ స్పెషల్‌ అనౌన్స్‌మెంట్‌.. భావోద్వేగానికి గురైన కన్నతల్లి..!

చెన్నై : ఓ విమాన పైలట్‌ తన ఇంటి సభ్యులకు ఊహించని బహుమతి ఇచ్చాడు. హృదయాన్ని హత్తుకునేలా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ప్రదీప్‌ కృష్ణన్‌ అనే పైలట్‌ తన ఫ్లైట్‌లోనే ప్రయాణిస్తున్న తల్లి, తాత, బామ్మల విషయంలో స్పెషల్‌ అనౌన్స్‌మెంట్‌ చేసి, వారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు.
”చెన్నై- కోయంబత్తూరు విమానంలో ఈరోజు మా అమ్మ, తాత, బామ్మ నాతో కలిసి ప్రయాణిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మా తాత ఈ రోజే మొదటిసారి నాతో విమానంలో ప్రయాణిస్తున్నారు. గతంలో ఆయన నన్ను ఎన్నో సార్లు తన స్కూటర్‌పై తిప్పారు. బదులుగా ఇప్పుడు ఆయన్ను విమానంలో ఎక్కించుకున్నాను” అని కెప్టెన్‌ ప్రదీప్‌ కృష్ణన్‌ తన అనౌన్స్‌మెంట్‌లో సరదాగా పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులను ప్రయాణికులకు పరిచయం చేశారు. ఈ భావోద్వేగ క్షణంతో వారి కళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి. అనంతరం విమానంలో ప్రయాణికులందరూ చప్పట్లు కొట్టి ఆ కుంటుబానికి వెల్‌కమ్‌ చెప్పారు.

➡️