మెకానికల్‌ ఇంజినీరింగ్‌తో ఉజ్వల భవిష్యత్తు

Mar 5,2024 21:37

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మెకాని కల్‌ ఇంజినీరింగ్‌ ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉందని జెఎన్‌ టియు వైస్‌ ఛాన్సలర్‌ కె.వెంకటసుబ్బయ్య అన్నారు. రెండు రోజులు పాటు జరిగిన 12వ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ సెమినార్‌ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేడు ప్రపంచంలో మంచి క్రేజ్‌ ఉన్న సబ్జెక్ట్‌, ఆదరణ, ఉపాధి అవకాశాలు ఉన్న విభాగం అన్నారు. సెమినార్లు ద్వారా నేర్చుకున్న విషయాలను ప్రయోగాత్మకంగా ఉపయోగించినప్పుడు మంచి అనుభవంతో పాటు ఆ సబ్జెక్ట్‌ నిపుణులు కావడానికి ఆస్కారం ఉంటుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేర్చుకున్న అంశాలను జోడించినపుడు నూతన ఆవిష్కరణలు వస్తాయన్నారు. అనంతరం వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️