సంగమేశ్వర ఆలయాభివృద్ధికి కృషి

Mar 15,2024 20:52

ప్రజాశక్తి-వంగర : సంగమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త తలే రాజేష్‌ అన్నారు. మండలంలోని సంగాంలో సంగమేశ్వర స్వామి ఆలయంలో పార్వతి అమ్మవారు టెంపుల్‌, శ్రీవారి కల్యాణ మండపం, భోగశాల, స్త్రీలు బట్టలు మార్చుకునేందుకు గదులు, మరుగుదొడ్లు నిర్మించేందుకు సిజిఎఫ్‌ నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరు కావడంతో ఎమ్మెల్సీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. తొలుత ఆలయంలో ఇఒ శివకేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంగాం గ్రామంలో సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఉత్తరావెల్లి సురేష్‌ ముఖర్జీ, వైసిపి మండల అధ్యక్షులు కరణం సుదర్శన్‌రావు, తహశీల్దార్‌ చిరంజీవి పడాల్‌, ఎంపిడిఒ సల్మాన్‌రాజు, సర్పంచ్‌ గేదెల పారమ్మ, ప్రధాన అర్చకులు సిద్ధాంతం గణపతిరావు , గేదెల రామకృష్ణ ఊగిరి ముత్యాల నాయుడు పాల్గొన్నారు.

➡️