సరిహద్దు వద్ద వాహనాల తనిఖీలు

Mar 25,2024 21:45
ఫొటో : తనిఖీలు చేపడుతున్న పోలీసులు

ఫొటో : తనిఖీలు చేపడుతున్న పోలీసులు
సరిహద్దు వద్ద వాహనాల తనిఖీలు
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని తిమ్మారెడ్డిపల్లి సమీపంలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టును సోమవారం కావలి డిఎస్‌పి వెంకటరమణ తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్‌ పోస్ట్‌లో రికార్డులను పరిశీలించి తగు సూచనలు సలహాలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెక్‌పోస్ట్‌లో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉదయగిరి సిఐ గిరిబాబు, ఎస్‌ఐ కె.తిరుపతయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

➡️