ప్రభుత్వ విద్యాసంస్థల్లో వందశాతం విద్యార్థులు చేరాలి : ఆర్‌జెడి

May 8,2024 21:27

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ప్రైవేటు విద్యా సంస్థలలో 25శాతం కోటా, కెజిబివిల్లో 100 శాతం సీట్లు భర్తీ జరిగేవిధంగా చూడాలని విద్యాశాఖ ఆర్‌జెడి బి.విజయభాస్కర్‌ ఆదేశించారు. బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డిఇఒ ప్రేమ్‌కుమార్‌తో పాటు ఎడిలు, డిప్యూటీ డిఇఒ, ఎఎస్‌ఒలు, సెక్టోరియల్‌ అధికారులతో సమావేశమయ్యారు. విద్యా హక్కుచట్టం ప్రకారం ప్రయివేటు పాఠశాలల్లో 25శాతం సీట్లు ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశాలకు ఎంపికైన విద్యార్ధుల ప్రవేశస్థితిపై సమీక్షించారు. ప్రవేశానికి అంగీకారం లేని తల్లిదండ్రుల వద్ద నుండి డిక్లరేషన్‌లు తీసుకోవాలని తెలిపారు. విద్యాకానుకకు సంబంధించి మండల స్టాక్‌ పాయింట్‌లలో తీసుకోవలసిన జాగ్రత్తలు, 2 రకాల మండల టీములు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వందశాతం ప్రవేశాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. కోర్టుకేసుల విషయంలో సంబందిత జిల్లా విద్యాశాఖ సిబ్బంది వెంట వెంటనే హాజరై సత్వర పరిష్కారం దిశగా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

➡️