50వ రోజుకు మిమ్స్‌ ఉద్యోగుల నిరసన

Mar 20,2024 21:27

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరశన సమ్మె బుధవారం నాటికి 50వ రోజుకు చేరుకుంది. స్థానిక ఆర్‌ఒబి వద్ద చేస్తున్న సమ్మెలో మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టి.వి. రమణ మాట్లాడుతూ గత 50రోజులుగా మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు జనవరి నెల జీతాలు, డిఎ బకాయిల, వేతన ఒప్పందం చేయాలని నిరశన సమ్మె చేస్తుంటే యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమన్నారు. పని చేసిన కాలానికి జనవరి నెల జీతాలు ఇంతవరకు మూడు నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం, మిమ్స్‌ యాజమాన్యం స్పందించి న్యాయమైన సమస్యలు పరిష్కరించి జనవరి నెల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ శిబిరంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, జిల్లా కమిటి సభ్యులు కిల్లంపల్లి రామారావు, ఉద్యోగులు ఎం.నారాయణ, కె. కామునాయుడు, కె.మధు, గౌరి, మూర్తి, ఎం.నాగ భూషణం, బంగారునాయుడు, తదితరులు పాల్గొన్నారు.

➡️