అన్నివర్గాలకూ మేలుచేసే మేనిఫెస్టో

Apr 28,2024 21:59

మే 1 న బొబ్బిలిలో బహిరంగ సభకు సిఎం జగన్‌

వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నవరత్నాలు కొనసాగిస్తూనే మరి కొన్నిటిని అదనగా చేర్చి అన్ని వర్గాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఎన్నికల మేనిఫెస్టో ఉందని వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ధర్మపురిలోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజలు మేలు చేకూర్చే ఆలోచనతో గత నవరత్నాలు కొనసాగిస్తూనే మరి కొన్ని కొత్త అంశాలు పొందుపర్చినట్లు తెలిపారు.ఉద్యోగ, ఉపాధి, ఆరోగ్యం, విద్య ప్రాధాన్యత పెంచే విధంగా కృషి చేస్తున్నామన్నారు. రానున్న ప్రభుత్వం ద్వారా 175 నియోజకవర్గాల్లో స్కిల్‌ కేంద్రాలు పెట్టి యువతకు నైపుణ్యం పెంచి ఉపాధి అవకాశాలు పెంచనున్నట్లు తెలిపారు. మహిళలను మరింత ఆర్థికంగా అభివద్ధి చెందాలని దష్టితో పొదుపు మహిళలకు ఎటువంటి వడ్డీ లేకుండా మూడు లక్షలు వరకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.చంద్రబాబు లాంటి అబద్ధపు హామీలు తాము ఇవ్వడం లేదన్నారు.గతంలో ఆయన ఇచ్చిన హామీలును సగం కూడానెరవేర్చెలేకపోయారన్నారు. మూడు రాజధానులకు కట్టుబడిఉన్నట్లు తెలిపారు. వైసిపి అభ్యర్థులకు ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 1 తేదిన బొబ్బిలిలో జరగనున్న బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి హాజరవుతారని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ పెనుమత్స. సురేష్‌ బాబు, నాయకులు కెవి సూర్యనారాయణరాజు పాల్గొన్నారు.

➡️