8 నుంచి అంగన్‌వాడీల నిరవధిక సమ్మె

మాట్లాడుతున్న ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు శకుంతల

మాట్లాడుతున్న ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు శకుంతల

 

ప్రజాశక్తి-రాయదుర్గం

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని డిసెంబర్‌ 8వతేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టు కార్యాలయాల కేంద్రాల్లో నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు శకుంతల తెలిపారు. శుక్రవారం రాయదుర్గం ప్రాజెక్టులో వర్కర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. స్వయంగా సిఎం జగన్‌ అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని తెలిపారు. అందుకనే తప్పని పరిస్థితుల్లో నిరవధిక సమ్మె చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ స్పందించి అంగన్‌వాడీలకు తెలంగాణ మాదిరి వేతనానికి అదనంగా రూ.వెయ్యి పెంచాలని, సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ రూ.2లక్షలు ఇవ్వాలని, అంగన్‌వాడీలను ఉద్యోగులుగా గుర్తించాలని, ఐసిడిఎస్‌ సంస్థను ప్రయివేటుపరం చేసే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే తమ సమ్మెలకే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజలు తమ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బంగి శివ, అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్‌ సీనియర్‌ రాయదుర్గం ప్రాజెక్టు కార్యదర్శి మేరీ, నాయకురాలు రాధా, రాధిక, మెహ్రూన్‌, గోవిందమ్మ, రుద్రమ్మ, అనురాధ, కృష్ణవేణి, రూప, చంద్రకళ, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

➡️