భూ యాజమాన్య హక్కు చట్టంతో నష్టం

తహశీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న సిఐటియు నాయకులు

        గుత్తి : రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం తీవ్ర నష్టదాయకం అని, తక్షణం దీనిని రద్దు చేయాలని అనంతపురం జిల్లా టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు జి.వెంకటశివుడు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం టిడిపి ఆధ్వర్యంలో తహశీల్దార్‌ భారతికు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంతో ప్రజల ఆస్తులకు రక్షణ కరువైందన్నారు. ఆ చట్టం ద్వారా భూ యాజమాన్య హక్కులను అన్యాక్రాంతం చేసేలా ఉన్నాయన్నారు. ప్రజల ఆస్తులను వైసీపీ నేతల పరం చేసేందుకే జగన్‌ కుట్రపన్నారని ఆరోపించారు. రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ బర్దివలి, నాయకులు నంద్యాల రంగారెడ్డి, గోవర్ధన్‌ గౌడ్‌, ఎల్లప్ప గౌడ్‌, సుధీర్‌ గౌడ్‌, సుధాకర్‌ యాదవ్‌, మాజీ ఎంపీటీసీ కుమార్‌, మాజీ సర్పంచులు ఎ.నరసింహులు, వైకుంఠ పాల్గొన్నారు.

➡️