పొగాకు రైతుకు ఊరట

Apr 8,2024 12:39 #Bapatla District

ప్రజాశక్తి-ఇంకొల్లు : వైట్ బర్లీ  పొగాకు ధర గత ఏడాదితో పాటు ఏడాది ప్రారంభం నుండి ధర ఆశాజనకంగా ఉండటంతో , పొగాకు సాగు రైతుకు కొంత  ఊరటగా ఉంది. తుఫానుకు ముందు సాగు చేసిన తోటలతో పాటు ఇటీవల జనవరి ఫిబ్రవరి నెలలో లేతగా వేసిన పొగాకు తోటల  రైతులకు నష్టాలు సవిచూచినప్పటికీ,  వర్షం దెబ్బతినకుండా ఉన్న ముదురు తోటలతో పాటు వర్షం అనంతరం వెంటనే నాట్లు వేసిన సాగు చేసిన రైతులకు కొంత మేరకు ఆకు బాగానే తేలింది. ఎకరాకు పది నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి రానుంది. 12 నుంచి 15 క్వింటాలు దిగుబడి వచ్చిన రైతుకు ప్రస్తుత ఉన్న ధరంతో పోల్చుకుంటే రైతు ఆశాజనకంగానే ఉన్నాడు. పది క్వింటాల దిగుబడి వచ్చిన రైతుకు లక్షన్నర రూపాయి  ఎకరాకు, 15 క్వింటాల దిగుబడి వచ్చిన రైతుకు ఎకరాకు రెండు లక్షల  పై చిలుకు వరకు ప్రస్తుత ధర  ప్రకారం అమ్మకం  కొనసాగించితే రానుంది.

ఎకరాకు లక్షపై చిలుకు పెట్టుబడి
పొగాకు సాగుకు ఈ ఏడాది పెరిగిన పెట్టుబడులు అధిక ఖర్చులతో ఎకరాకు లక్షా పదివేల వరకు పెట్టుబడి నీటి వసతిని బట్టి ఇంకా అదనము ఖర్చు కానుంది. వ్యవసాయానికి ఎకరాకు పదివేలు, నారు కర్చు పదివేలు, కౌలు  రైతు అయితే అదనంగా కవులు పాతిక నుంచి రూ.30,000, మొక్కల నాటుకు ఎకరాకు రూ.4000, ఎరువులు రూ.5000, పురుగుమందు కలుపు నుంచి రూ.15000 వేలు, ఆగు కొట్టుడుకు ఎకరాకు రూ.30000, పందిరి బొంగులు తాడు, కులు తొక్కటం బాడుగా వగైరాలు కలిపి మరో రూ.10,000, నీతి ఖర్చు దూరము నీతి వసతిని బట్టి రూ.5000 నుంచి 20 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన ఎకరాకు లక్ష నుంచి లక్ష 25 వేలు ఖర్చు సగటున కానుంది. ఆకు కొట్టుడుకు ప్రారంభంలో ఒక మనిషికి వచ్చి రూ.500 రూపాయల కూలీతో ప్రారంభమై చివరి దశ వచ్చేసరికి ముమ్మరం సమయంలో మనిషికి వచ్చాయి.

➡️