సిపిఎం నేత గౌస్‌దేశాయ్ ని గెలిపించండి : సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు-మాజీ శాసనసభ్యులు ఎం.ఏ.గఫూర్‌

ప్రజాశక్తి-కర్నూలు కార్పోరేషన్‌ : పాణ్యం నియోజకవర్గంలో సిపిఎం కార్మిక నాయకుడు గౌస్‌ దేశాయ్ ని గెలిపించాలంటూ … సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ శాసనసభ్యులు ఎం.ఏ.గఫూర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఎస్‌.కె.రియాజ్‌ అధ్యక్షతన డ్రైవర్లు, డ్రైవర్‌ కం ఓనర్‌ సమావేశములో ఎం.ఏ.గఫూర్‌ మాట్లాడుతూ … 2014లో ఒక బ్యారల్‌ ధర 140 డాలర్లు ఉన్నపుడు డీజిల్‌ 55, పెట్రోల్‌ 60 రూపాయలు ఉండేది అన్నారు. లాక్‌డౌన్‌ సమయములో బ్యారల్‌ ధర రూ.20 ఉన్నా, నేడు రూ.80 ఉన్న ధర తగ్గించకుండా 21 లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వచ్చి ప్రజల కొనుగోలు శక్తి పెరిగేదని, అలా చేయకుండా ప్రజల మధ్యన హిందూ, ముస్లిము అని మత విద్వేషం సఅష్టించి, చర్చిలను ధ్వంసం చేస్తూ, మహిళలను నగంగా ఉరేగించి పైశాచికతత్వాన్ని ప్రదర్శిస్తూ, లేబర్‌ కోడ్‌ పేరుతో కార్మిక హక్కులను కాలరాస్తూ, రైతులను నష్టపరచే చట్టాలను తెస్తూ దేశాన్ని మతప్రాదిపదికన విభజించాలని ప్రయత్నిస్తున్న బిజెపిని ఓడించాలని అన్నారు. రాష్ట్రములో 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రూ.2 లక్షల 30 కోట్లు ప్రజల సంక్షేమనికి ఖర్చు చేశామని చెబుతున్న వైసిపి ప్రభుత్వం దగ్గర రూ.7 లక్షల 70 కోట్లకు లెక్కలు లేవని ఇదంతా అధికార పార్టీ నాయకులు కొల్లగొట్టుకున్నారన్నారు, ఇలాంటి సందర్భములో సిపిఎం ప్రజా పునాది పెంచుకోవాలని పాణ్యం నియోజకవర్గములో అత్యధిక ఓట్లు తెచ్చుకోవాలన్నారు. గెలుపు, ఓటములు ప్రజలు నిర్ణయిస్తారని, 10 రోజులు కష్టపడాలి అని లారీ కార్మికుల కు, డ్రైవర్స్‌ కం ఓనర్స్‌ కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో డ్రైవర్‌ కం ఓనర్స్‌ నాయకులు జి.శ్రీనివాసులు, నెరవాడ, పర్ల, గోకులపడు, పందిపాడు, కల్లూరు, శరీన్‌ నగర్‌, ముజఫర్‌ నగర్‌, గణేష్‌ నగర్‌, తదితర కాలనీవారు పాల్గొన్నారు.

➡️