జిల్లా వ్యాప్తంగా సాల్ట్‌ పరీక్ష

Apr 17,2024 00:04

పరీక్షలను పర్యవేక్షిస్తున్న డిఇఒ శైలజ
ప్రజాశక్తి-గుంటూరు :
సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్రోగ్రామ్‌ (సాల్ట్‌)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌, ఎడ్యుకేషనల్‌ ఇనిషియేటివ్స్‌ సంయుక్తంగా జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల నుండి ఎంపిక చేసిన 129 పాఠశాలల్లో నాలుగో తరగతి చదువుతున్న 3460 మంది విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీషు, గణితం, పాఠ్యాంశాలలో ఎంపిక చేసిన ఏవైనా రెండు పాఠ్యాంశాలలో స్టేట్‌ లెవల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే పరీక్ష నిర్వహించారు. మంగళవారం డిఇఒ పి.శైలజ స్థానిక గుంటూరు రూరల్‌ మండలంలోని అంకిరెడ్డిపాలెం జెడ్పీ హైస్కూల్‌ను పరిశీలించారు. డిసిఇబి సెక్రెటరీ లలిత ప్రసాద్‌ నంబూరులోని గరల్స్‌ హైస్కూల్‌ను, సమగ్ర శిక్ష ఎపిసి విజయలక్ష్మి స్థానిక చౌత్రా సెంటర్‌లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పరిశీలించారు. విద్యార్థుల్లో ఉన్న భాషా, గణిత సామర్థ్యాలు అంచనా వేయటం కోసం ఈ పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉర్దూ డిఐ ఖాసిం, బఎంఒ ప్రసాద్‌, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల హెచ్‌ఎం విజయలక్ష్మి పాల్గొన్నారు.

➡️