పెద్దపాడులో సిపిఎం అభ్యర్థి ఇంటింటి ప్రచారం

May 3,2024 14:42 #campaign, #CPM candidate, #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం పాణ్యం నియోజకవర్గ అభ్యర్థి గౌస్‌ దేశారు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం పెద్దపాడు గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. పెద్దపాడు లో ప్రధానంగా మూలగేరి, మాలగేరి, మాదిగ పేట, వాటర్‌ ట్యాంక్‌ ఏరియా లలో సిపిఎం పార్టీ కార్యకర్తలు కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. కర్నూలుకు కూత వేటు దూరంలో ఉన్న పెద్దపాడు పెద్ద ఎత్తున తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నది. ప్రస్తుతము కర్నూలు కార్పొరేషన్‌ లో 36వ వార్డుకు సంబంధించినది. గత 15 సంవత్సరాలుగా పాణ్యం ఎమ్మెల్యేలుగా ఉన్న కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, గౌరు చరిత తాగునీటి సమస్యను పరిష్కారం చేయలేదని ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రస్తుతం పార్లమెంటు, శాసనసభకు జరిగే ఎన్నికల్లో పెదపాడు గ్రామంలో శాశ్వత తాగునీటి పరిష్కారం కొరకు సిపిఎం పార్టీ కఅషి చేస్తే వారికే తమ ఓటు వేస్తామని ప్రజలు తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి తన ద్యెయమని చెప్పుకుంటున్న జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పెదపాడు గ్రామంలో రోడ్ల అధ్వానంగా ఉన్నాయని, మురుగునీటి సౌకర్యం కల్పించాలని, ఇంటి పన్నులు తగ్గించాలని, కరెంటు చార్జీలు తగ్గించాలని, వడ్లోని వంక నుండి వరద నీరు రాకుండా కరకట్ట నిర్మించాలని ప్రజలు తమ సమస్యలను ప్రచార బఅందానికి తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం సిఐటియు కార్యకర్తలు మార్కెట్‌ యార్డ్‌ వేర్హౌస్‌ అమాలీలు, సిపిఎం నాయకులు గోవిందు, గోపాల్‌, మద్దిలేటి, గోపి, ఎర్ర నాగరాజు, మౌలాలి, మేస్త్రి నాగరాజు, శ్రీనివాసులు, మార్కెట్‌ యార్డ్‌ శీను, డప్పు కళాకారులు రత్నం, రాజు పాల్గొన్నారు.

➡️