ముమ్మర తనిఖీలు

Apr 8,2024 17:15 #Eluru district

ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : ఏలూరు జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లలో ముమ్మర తనిఖీలు చేస్తున్న పోలీసులకు సోమవారం భారీగా బంగారం వెండి నగదు పట్టుబడ్డాయి. పెదవేగి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కలపరు చెక్పోస్ట్ వద్ద రూరల్ శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో పెదవేగి శ్రీనివాస్ కుమార్ పెదపాడు ఎస్ఐ శుభశేకర్లు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ నుండి ఏలూరు నరసాపురాలకు బంగారం వెండి ఆభరణాలను ఎటువంటి బిల్లులు లేకుండా రవాణా చేస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీచేయుగా ఆ వాహనంలో 16 కేజీల బంగారు ఆభరణాలు 30 కేజీల వెండి ఆభరణాలు ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు వెంటనే వాటిని సీట్ చేశారు. ఏలూరు వైపు నుండి విజయవాడ వైపునకు ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండా కొరియర్ వాహనంలో 15 లక్షల రూపాయల నగదును తరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు వెంటనే 15 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెదపాడు ఎస్ఐ శుభ శేఖర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎవరైనా 50 వేలకు పైబడి నగదును తమ వెంట తీసుకుని వెళ్లాలంటే కచ్చితంగా అనుమతులు తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ఎటువంటి బిల్లులు లేకుండా రవాణా చేస్తున్న బంగారు వెండి ఆభరణాలతో పాటు 15 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చెక్పోస్ట్ ఎస్ఎఫ్టి టీం తో పాటుగా పెదపాడు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️