ఉచిత హోమియో వైద్యశిబిరం

May 27,2024 00:00 #Homeo, #Medical camp
Homeo Medical camp

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక కలిగొట్ల స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్‌ ఆధ్వర్యాన చిన్న బజారులో ఉన్న ఫౌండేషన్‌ కార్యాలయం వద్ద ఆదివారం ఉచిత హోమియో వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు వంద మందికి వైద్యులు టి.జగన్నాథరావు, టిజె.మోహన్‌ వైద్య పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు. ముందుగా వైద్య శిబిరాన్ని ఫౌండేషన్‌ చైర్మన్‌ కె.శ్రీరామచంద్రమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ ప్రతినిధులు కెఎస్‌ఎన్‌.మూర్తి, కె.చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️