ఉపాధిని నీరుగార్చిన ప్రభుత్వాలు

ప్రజాశక్తి-కమలాపురంఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరు గార్చాయని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. మంగళవారం కమలాపురం నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వ హించారు. యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలతో కమలాపురం సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి చంద్రతో కలిసి ముఖాముఖి నిర్వహి ంచారు. ఉపాధి హామీ కూలీల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కింద ఎటువంటి వసతుల కల్పన లేదని రోజంతా కష్టపడ్డా రూ.200 కన్నా ఎక్కువ ఇవ్వడం లేదని షర్మిల దృష్టికి కూలీలు తీసుకువచ్చారు. వృద్దులకు రూ.150 కన్నా ఎక్కువ ఇవ్వడం లేదని తెలిపారు. కూలీలకు భరోసా నింపేం దుకు తాను సైతం పలుగు, పార పట్టి మట్టి తవ్వారు. ఆయా ప్రాంతాల్లో నిర్వ హించిన సభల్లో షర్మిల మాట్లాడుతూ కూలీలకు పనితో పాటు వసతులు లేవ న్నారు. కనీసం మంచినీరు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలో వచ్చిన వెంటనే ఉపాధి హామీ కూలీలకు రోజు వేతనం రూ.400 ఇస్తామని తెలిపారు. కమలాపురం ఎమ్మెల్యే రవీం ద్రనాథ్‌రెడ్డి జిఎన్‌ఎస్‌ఎస్‌ లక్ష ఎకరాలకు సాగు నీరు ఇస్తామన్నారని, తట్టెడు మట్టి తియ్యలేదని పేర్కొన్నారు. సర్వారాయ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేదని తెలిపారు. సర్వారాయ ప్రాజెక్ట్‌ ద్వారా రైతులకు ఏమో కానీ… రవీంద్రనాథ్‌ రెడ్డి చేపల చెరువు, రొయ్యల చెరువుకి నీళ్ళు వస్తున్నాయని తెలిపారు. ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమ అని తెలిపారు. అధికారం ఉన్నది మీ చెరువులు నింపుకోడానికా? అని ప్రశ్నించారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఒక్క ఉద్యమం చేయ లేదన్నారు విశాఖ స్టీల్‌ ఎంత ముఖ్యమో మనకు కడప స్టీల్‌ అంత ముఖ్యమన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ వచ్చి ఉంటే లక్ష ఉద్యోగాలు అయినా వచ్చేవని తెలిపారు.

➡️