గాలివాన బీభత్సం

ప్రజాశక్తి-యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించాయి. మంగళవారం సాయంత్రం నుంచే ఈదురగాలులతో ప్రారంభమై.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. ఈదురు గాలులకు ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో సుమారు 75 ఎకరాల్లో అరటి పంట నష్టం వాటిల్లింది. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. పొలాల్లో నీళ్లు నిలవడంతో పశువుల మేత తడిసిపోయింది. మరో ప్రాంతంలో మట్టిమిద్దె కూలింది. ఇదీలా ఉండగా ఇప్పటి వరకు ఎండ వేడిమితో.. ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వర్షం రాకతో ఉపశమనం పొందారు. చల్లటి వాతావరణాన్ని ఆస్వాధించారు. 73 ఎకరాలలో అరటి పంట నష్టంరైల్వేకోడూరు : నియోజకవర్గంలో గత రాత్రి గాలి వాన బీభత్సం సష్టి ంచడంతో దాదాపు 73 ఎకరాలలో అరటి పంట నష్టం జరిగిందని ఉద్యానవన శాఖ అధికారి భాస్కర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడూరు మండ లంలోని ఎస్‌.ఉప్పరపల్లె, చియ్యవరం గ్రామాలలో 20 ఎకరాలలో, ఓబుల వారిపల్లె మండలంలోని వై.కోట, గాదెల గ్రామాలలో 50 ఎకరాలు, పుల్లంపేట మండలంలోని అప్పరాజు పేటలో మూడు ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయని తెలి పారు. ఈ మేరకు పంట నష్టానికి సంబంధించి అంచనాలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతున్నామని తెలిపారు.ప్రతి ఏడాది పంట చేతికి వచ్చే సమయానికి ప్రకతి వైపరీత్యాలతో తీవ్ర నష్టానికి గురవుతున్నామని ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. బి.కొత్తకోట : మండలంలో కుండపోత వర్షం కురిసింది. మంగళవారం రాత్రి సమయంలో కురిసిన భారీ వర్షానికి, పట్టణంలోని పలు దుకా ణాలు, పురాతనమైన చెన్నకేశవ స్వామి ఆలయం నీటి మునిగింది. గతంలో 2021లో రాత్రి వేళలో కురిసిన భారీ వర్షంతో నీటి మునుగుతుందని ఆలయ అర్చకులు కేశవస్వామి తెలిపారు. దేవాదాయ శాఖ వారు ప్రత్యేక దష్టి వహించి ఆలయ నిర్మా ణంలోకి నీరు రాకుండా ఆలయ పరిసరాలు ఎత్తు పెంచే విధంగా మరమ్మతులు చేపించాలని ఆయన కోరారు. వడగండ్ల వాన..బి. కోడూరు : మండలంలోని పది పంచాయతీల్లో మంగళవారం అర్ధరాత్రి కురిసిన వడగండ్ల వానకు రోడ్లపై నీళ్లు నిలిచాయి. ఆయా గ్రామాల్లో రహదారి వెంబడి ఉన్న నీడనిచ్చే చెట్లు విరిగిపోయి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. కొన్ని చోట్ల విద్యుత స్థంభాలు నేలకొరిగాయి. దీంతో కొద్దిసేపు విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. వాన వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కూలిన మట్టిమిద్దెచాపాడు : మండల పరిధిలో మంగళవారం అర్థరాత్రి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పెద్ద శబ్ధంతో కూడిన ఉరుములతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వర్షం కూడా ఒక మోస్తరుగా కురిసింది. ఉరుములు, మెరుపుల తాకిడికి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగింది. ఖాళీగా ఉన్న పంట పొలాల్లో నీరు నిలిచింది, పశువులకు మేతకు ఇబ్బంది ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధిక వర్షానికి గుంతచియ్యపాడు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున వర్షానికి గొర్ల పెద్దతిరుపాల్‌కు చెందిన మట్టిమిద్దె ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలో ఇంటిలో ఉన్న జయచంద్రకు గాయాలయ్యాయి. ఇంటిలోని సామగ్రి పూర్తిగా దెబ్బతిన్నాయని, సుమారు రూ.రెండు లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. గ్రామాలలో విద్యుత్‌స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.ఫోటో కూలిన మట్టి మిద్దె,నిలిచిన వర్షంనీరువిద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయంచెన్నూరు : మంగళవారం రాత్రి 11 గంటల నుంచి చెన్నూరు మండల వ్యాప్తంగా మెరుపుల శబ్దాలతో భారీ వర్షం కురిసింది. పెనుగాలుల తాకిడికి చెన్నూరు రామనపల్లి ఉప్పరపల్లి పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడం విరిగిపోయాయి. విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు చెన్నూరు విద్యుత్‌ సబ్స్టేషన్‌ పరిధిలో విద్యుత్‌ తీవ్ర అంతరాయం కలిగింది. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు భారీ వర్షం కురిసింది. మండల వ్యాప్తంగా 75 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు మండల రెవెన్యూ అధికారులు చేశారు. భారీ వర్షం పెనుగాలు తాకిడికి అనేక చోట్ల చెట్లు విరిగిపడడం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా అనే ఒక చోట్ల రోడ్లు జలమయ్యాయి. చెన్నూరు భవాని నగర్‌ లోని రోడ్డు వేయకపోవడం డ్రెయినేజీ ఏర్పాటు చేయకపోవడం కారణంగా వర్షం నీరు రోడ్డును ముంచెత్తింది. ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు భారీ వర్షంతో ఉపశమనం లభించింది.నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలుసింహాద్రిపురం : మండలంలో మంగళవారం రాత్రి వీచిన భారీ గాలులకు విద్యుత్‌ శాఖకు నష్టం సంభవించింది. మండల పరిధిలోని కడప నాగయ్యపల్లె, కోరగుంటపల్లె, అంకాలమ్మ గూడూరు తదితర గ్రామాలలో దాదాపు 45 విద్యుత్‌ స్తంభాలు, నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. దీంతో మూడు గ్రామాల పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ గాలుల కారణంగా నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలను, ట్రాన్స్‌ఫార్మర్లను పులివెందుల రూరల్‌ ఎడిఇ జి. సుధాకర్‌రెడ్డి, ఎఇ సుబ్రహ్మణ్యం పరిశీలించారు. ఏర్పడింది. వాన వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కూలిన మట్టిమిద్దె చాపాడు : మండల పరిధిలో మంగళవారం అర్థరాత్రి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పెద్ద శబ్ధంతో కూడిన ఉరుములతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వర్షం కూడా ఒక మోస్తరుగా కురిసింది. ఉరుములు, మెరుపుల తాకిడికి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగింది. ఖాళీగా ఉన్న పంట పొలాల్లో నీరు నిలిచింది, పశువులకు మేతకు ఇబ్బంది ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధిక వర్షానికి గుంతచియ్యపాడు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున వర్షానికి గొర్ల పెద్దతిరుపాల్‌కు చెందిన మట్టిమిద్దె ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలో ఇంటిలో ఉన్న జయచంద్రకు గాయాలయ్యాయి. ఇంటిలోని సామగ్రి పూర్తిగా దెబ్బతిన్నాయని, సుమారు రూ.రెండు లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. గ్రామాలలో విద్యుత్‌స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయంచెన్నూరు : మంగళవారం రాత్రి 11 గంటల నుంచి చెన్నూరు మండల వ్యాప్తంగా మెరుపుల శబ్దాలతో భారీ వర్షం కురిసింది. పెనుగాలుల తాకిడికి చెన్నూరు రామనపల్లి ఉప్పరపల్లి పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడం విరిగిపోయాయి. విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు చెన్నూరు విద్యుత్‌ సబ్స్టేషన్‌ పరిధిలో విద్యుత్‌ తీవ్ర అంతరాయం కలిగింది. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు భారీ వర్షం కురిసింది. మండల వ్యా ప్తంగా 75 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు మండల రెవె న్యూ అధికారులు చేశారు. భారీ వర్షం పెనుగాలు తాకిడికి అనేక చోట్ల చెట్లు విరిగిపడడం చోటు చేసుకుంది. భారీ వర్షం కార ణంగా అనే ఒక చోట్ల రోడ్లు జలమయ్యాయి. చెన్నూరు భవాని నగర్‌ లోని రోడ్డు వేయకపోవడం డ్రెయినేజీ ఏర్పాటు చేయక పోవడంతో వర్షం నీరు రోడ్డును ముంచెత్తింది. ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు భారీ వర్షంతో ఉపశమనం లభించింది.నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలుసింహాద్రిపురం : మండలంలో మంగళవారం రాత్రి వీచిన భారీ గాలులకు విద్యుత్‌ శాఖకు నష్టం సంభవించింది. మండల పరిధిలోని కడప నాగయ్యపల్లె, కోరగుంటపల్లె, అంకాలమ్మ గూడూరు తదితర గ్రామాలలో దాదాపు 45 విద్యుత్‌ స్తంభాలు, నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. దీంతో మూడు గ్రామాల పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ గాలుల కారణంగా నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలను, ట్రాన్స్‌ఫార్మర్లను పులివెందుల రూరల్‌ ఎడిఇ జి. సుధాకర్‌రెడ్డి, ఎఇ సుబ్రహ్మణ్యం పరిశీలించారు.

➡️