కడప ‘ఉక్కు’ ఊసేది?

ప్రజాశక్తి-పీలేరు/కలికిరిరాష్ట్ర విభజన హామీల్లో రాయలసీమకు అత్యంత ముఖ్యమైన హామీ కడప ఉక్కు పరిశ్రమ గురించి కనీసం ఇసుమంత కూడా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రసావన చేయ లేదు. బుధవారం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి సైనిక్‌ స్కూల్‌ సమీపంలో ప్రజాగళం వికసిన భారత్‌ – వికసిత ఆంధ్ర పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సంద ర్భంగా మోడీ చేసిన ప్రసంగంలో రాష్ట విభజన హామీలైన రాష్టానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన స్పెషల్‌ డెవలప్‌ మెంట్‌ నిధులు, రైల్వే జోన్‌ వంటి హామీలను ప్రస్తావ నకునోచుకోలేదు. సరికదా రాయల సీమ అభివృద్దే నాకల, రాష్టాభివృద్దే నా ఆకాంక్ష అనడం విస్మయాన్ని కలిగించింది. కడప-బెంగళూరు రైల్వేలైన్‌ కడప ఎయిర్‌పోర్టుకు మౌలిక వసతులు కల్పస్తామని ముక్తసరిగా ప్రస్తావించడం మినహా ఎటువంటి హామీలు ఇవ్వకపోవడం గమనార్హం. రాయలసీమలో ఎన్నో ఖనిజాలు, ప్రకృతి వనరులకు నిలయమని, విహార, తీర్థ యాత్రా స్థలాలకు ప్రసిద్ది చెందిందని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు కష్టపడేతత్వముందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని రాయలసీమ రైతుల ఉత్పాదకతను ప్రోత్సాహిస్తూ ఇక్కడ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దే తన లక్ష్యమని, రాష్ట్రాన్ని రాయలసీమ ముఖ్యమంత్రి పాలిస్తునన్నా ఇక్కడ అభివృద్ధి జరగలేదని, చరిశ్రములు కూడా రాలేదని విమర్శించారు. కనీసం రైతులకు సాగునీరు కూడా అంది ఇవ్వ లేదని ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితులు మారాలంటే డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఏర్పాటు ఆవశ్యమని తెలిపారు. ఇక్కడి పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ట్రంలో అభివృద్ది జరగక పోగా రౌడీయిజం, మాషియాలకు అండగా నిలిచిందని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించిందని తెలిపారు. ఇనుక దూషియాను ప్రోత్సహించిన ఫలితంగా అన్నమయ్య ప్రాజెక్ట్‌ తెగిపోయి ప్రజల మృతిఇకి, ఆస్తి నష్టానికి కారణమైందని ఆరోపించారు. ఇక వైసిపి ఆటలు సాగవని, కౌంట్‌ డౌన్‌ మొదలైందని హెచ్చరించారు. మాజీ సిఎం, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అటు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ఇటు దేశ ప్రధానిగా దశాపాబ్దాల పాటు వనిచేసి అవినీతి రపాత నేతగా సరేంద్రమోడీ పేరు తెచ్చుకున్నారు. కోవిడ్‌ కష్టకాలంలో వ్యాక్సినేషన్‌ కోట్లమందకి ఉచితంగా అందించిన ఘనత ఆయనదన్నారు. పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత కూడా మోడీదేనని కొనియాడారు.తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మాట్లాడుతూ తెలుగుగంగ ప్రాజెక్టును తీసుకు వచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేసిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకే దక్కుతుందని తెలిపారు. పదేళ్ల మోడీ వరిపాలనలో అభివృద్ధి, సంక్షేమంతో దేశం ముందుకు వెళుతూ నూపర్‌ పవర్‌గా ఎదుగుతోందని చెప్పారు.జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు మాట్లాడుతూ ఐదేళ్ళ వైసిపి పాలనలో హిందూ ధర్మం నాశనం చేస్తూ దేవాలను కూలగొడుతోందని, తిరుకుల పవిత్రకు భంగం కల్గిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పీలేరు, తంబళ్లపల్లె, రాయచోటి, శ్రీకాళహస్తి, పుంగనూరు టిడిపి అభ్యర్థులు నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, బొజ్జల సుధీర్‌రెడ్డి, చల్లాబాబు, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ వనువులేటి హరిప్రసాద్‌, బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్‌ పాల్గొన్నారు.

➡️