‘ఉపాధి’కి రూ.2.5 లక్షల కోట్లు కేటాయించాలి

Jun 26,2024 22:59

ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న కారెం వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌

ఉపాధి హామీ చట్టానికి రూ.2.5లక్షల కోట్లు కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం అమలాపురం మండలం నడిపూడి తదితర గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో ఆయన మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కోపం వఛ్చినప్పుడల్లా ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేస్తామని అంటున్నారని, గ్రామాల్లో ఉన్న పెత్తందారులు కూడా అదేమాట అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితిలో ఈ చట్టం రద్దు అవ్వకుండా పోరాటం చేస్తున్నామన్నారు. బిజెపికి పూర్తి మెజారిటీ వచ్చుంటే ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేసే వారని ఆయన వాపోయారు. ఈ చట్టాన్ని కాపాడుకుంటేనే కార్మికులకు ఎంతో కొంత మేలు జరుగుతుందని తెలిపారు. ఉపాధి కార్మికులకు పనిదినాలు 200రోజులు, కూలి రేట్లు రూ.600 పెంచాలని, పే స్లిప్‌ గతంలో ఇచ్ఛే విధానంగా ఇప్పుడు కూడా ఇవ్వాలన్నారు. కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఎలాంటి ఇన్సూరెన్స్‌ సదుపాయామూ లేదన్నారు. వీరికి రూ.5లక్షల ఇన్సూరెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చాలా గ్రామాల్లో మెడికట్ల టెంట్లు కూలీలకు ఇవ్వడం లేదని, అన్ని గ్రామాల మేట్లకు మెడికల్‌ కిట్లు టెండూ అందించే ఏర్పాట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టాన్ని కావాలనే నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పొలమూరి శ్రీనివాస్‌, మేట్లు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

 

➡️