వెలిగండ్ల జెడ్పిటిసికి మాతృవియోగం

Apr 3,2024 11:59 #Prakasam District

ప్రజాశక్తి-వెలిగండ్ల : వెలిగండ్ల జెడ్పిటిసి గుంటక తిరుపతిరెడ్డి మాతృమూర్తి గుంటక రామసుబ్బమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం హైదరాబాద్ లో మృతి చెందారు. మృతదేహాన్ని జడ్పీటీసీ స్వగ్రామమైన వెలిగండ్ల మండలం వెదుళ్లచెరువు గ్రామానికి తీసుకొని వచ్చారు. విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ బుధవారం వారి స్వగ్రామమైన వెలిగండ్ల మండలం వెదుళ్ళ చెరువు గ్రామానికి చేరుకొని రామ సుబ్బమ్మ మృతదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వెలిబుచ్చారు. వీరి వెంట మాజీ మంత్రివర్యులు ముక్కు కాశిరెడ్డి, దర్శి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాదరెడ్డి, కనిగిరి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్, కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, మాజీ జెడ్పిటిసి రామన తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు.

➡️