నేడు అన్నమయ్య జిల్లాకు ప్రధాని మోడీ రాక

ప్రజాశక్తి- కడప ప్రతినిధి / పీలేరు/కలికిరి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం జిల్లాలోని పీలేరు, కలికిరి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రోడ్‌షో, బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అన్నమయ్య జిల్లా పరిధిలోని రాజంపేట పార్లమెంట్‌ బరిలో నిలిచిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రె డ్డితో సహా మిగిలిన కూటమి తరుపున అసెంబ్లీ బరిలో నిలిచిన అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారం చేయడంలో భాగంగా రోడ్‌ షో, బహిరంగసభ నిర్వహిస్తారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు కలికిరి సైనిక్‌ స్కూల్‌ సమీపంలో బిజెపి, టిడిపి, జనసేన కూటమి విజయ శంఖారావం బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తదితర నాయకులు పాల్గొంటారని సమాచారం. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం బిజెపి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో పాటు పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థుల గెలుపును కోరుకుంటూ ఏర్పాటు చేసిన ఈ ఎన్నికల ప్రచార సభకు ప్రధానమంత్రి హాజరుకా నుండడంతో ప్రోటోకాల్‌ అనుసరిస్తూ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు హాజరయ్యే ముఖ్య నేతల కోసం సైనిక్‌ సమీపంలో మూడు వేర్వేరు హెలీప్యాడ్లు సిద్ధం చేసి ఉంచారు. అలాగే హెలీప్యాడ్ల నుంచి సభా వేదిక వరకు కాన్వారు వెళ్లడానికి వీలుగా కొత్తగా ప్రత్యేక తారు రోడ్డు నిర్మించారు. అలాగే అక్కడి పరిసరాలను కూడా చదును చేసి ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి ఈ బహిరంగ సభా ప్రాంగణమంతా కేంద్ర భద్రతాధికారుల ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలను ఈ ప్రాంతంలో మోహరించారు. సభా ప్రంగణాన్ని, పరిసరాలను అన్నింటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కార్యక్రమం ఏర్పాట్లను మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గం బిజెపి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి, ఇతర నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 2014లో తిరుపతిలో నిర్వహిం చిన బహిరంగ సభలో రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేకహౌదా ఇస్తా మని, వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ జిల్లాలకు జిల్లాకు రూ. 25 కోట్ల చొప్పున స్పెషల్‌డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం పదేళ్లపాటు ప్రధానిగా పని చేసినప్పటికీ ఒక్క హామీని నెరవేర్చకపోవడం గమనార్హం.వీటికితోడు అన్నమయ్య జిల్లా పరిధిలోని జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫ్యాకేజీ-2 పనులకు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయకపో వడం, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఫీజుబులిటీ లేదని మో కాలడ్డిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో 2014లో కూట మి కట్టిన నేతలైన ప్రధాని మోడీ, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ హాజరవుతుండడం చర్చనీయాంశ ంగా మారింది.భారీ బందోబస్తు నడుమ సభా ప్రాంగణం ప్రధానమంత్రి బహిరంగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా ఉండేందుకు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఒక ఐజి, ఒక డిఐజి, మరో అదనపు డిఐజి, 15 మంది ఎస్‌పిలు, 20 మంది అదనపు ఎస్‌పిలు, 50 మంది డిఎస్పీలు, 100 మంది సిఐలు, 3 వేల మంది వివిధ స్థాయి పోలీసు సిబ్బంది మోహరించారు.ఫోటో రైటప్‌:ప్రధానమంత్రి సభా వేదిక ఏర్పాటు దశ్యం (07 పీలేరు01, 02) – ప్రధానమంత్రి రాక కోసం ఏర్పాటుచేసిన హెలిఫ్యాడ్లు (07 పీలేరు03) – ఎలిఫడ్‌ నుంచి సభా వేదిక వరకు ఏర్పాటు చేసిన తారు రోడ్డు (07 పీలేరు04) – బందోబస్తుకు వచ్చిన పోలీసు సిబ్బందికి సూచనలిస్తున్న అధికారిణి (07 పీలేరు05) – ఎలిఫెంట్‌ ప్రాంతంలో తనిఖీలు చేపట్టిన బాంబు స్క్వాడ్‌ (07 పీలేరు06)- సభా వేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్న రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెపీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థుల గెలుపును కోరుకుంటూ ఏర్పాటు చేసిన ఈ ఎన్నికల ప్రచార సభకు ప్రధానమంత్రి హాజరుకా నుండడంతో ప్రోటోకాల్‌ అనుసరిస్తూ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు హాజరయ్యే ముఖ్య నేతల కోసం సైనిక్‌ సమీపంలో మూడు వేర్వేరు హెలీప్యాడ్లు సిద్ధం చేసి ఉంచారు. అలాగే హెలీప్యాడ్ల నుంచి సభా వేదిక వరకు కాన్వారు వెళ్లడానికి వీలుగా కొత్తగా ప్రత్యేక తారు రోడ్డు నిర్మించారు. అలాగే అక్కడి పరిసరాలను కూడా చదును చేసి ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. మంగ ళవారం నుంచి ఈ బహిరంగ సభా ప్రాంగణమంతా కేంద్ర భద్రతాధికారుల ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలను ఈ ప్రాంతంలో మోహరించారు. సభా ప్రంగణాన్ని, పరిసరాలను అన్నింటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కార్యక్ర మం ఏర్పాట్లను మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గం బిజెపి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి, ఇతర నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 2014లో తిరుపతిలో నిర్వహిం చిన బహిరంగ సభలో రాష్రా ్టనికి పదేళ్లపాటు ప్రత్యేకహౌదా ఇస్తా మని, వెనుకబడిన ప్రాం తమైన రాయలసీమ జిల్లాలకు జిల్లాకు రూ. 25 కోట్ల చొప్పున స్పెషల్‌డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం పదేళ్లపాటు ప్రధాని గా పని చేసినప్పటికీ ఒక్క హామీని నెరవేర్చకపోవడం గమ నార్హం. వీటికితోడు అన్నమయ్య జిల్లా పరిధిలోని జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫ్యాకేజీ-2 పనులకు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయకపో వడం, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఫీజుబులిటీ లేదని మో కాలడ్డిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో 2014లో కూట మి కట్టిన నేతలైన ప్రధాని మోడీ, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ హాజరవుతుండడం చర్చనీయాంశ ంగా మారింది. భారీ బందోబస్తు నడుమ సభా ప్రాంగణం ప్రధానమంత్రి బహిరంగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా ఉండేందుకు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఒక ఐజి, ఒక డిఐజి, మరో అదనపు డిఐజి, 15 మంది ఎస్‌పిలు, 20 మంది అదనపు ఎస్‌పిలు, 50 మంది డిఎస్పీలు, 100 మంది సిఐలు, 3 వేల మంది వివిధ స్థాయి పోలీసు సిబ్బంది మోహరించారు.డ్డి, పీలేరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి సోదరులు (07 పీలేరు07)

➡️