శాస్త్రీయ దృక్ఫథం, నాణ్యమైన విద్య,వైద్యం కావాలి : జెవివి

May 8,2024 22:24

పీపుల్స్‌ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న జేవీవీ నాయకులు

                  ధర్మవరం టౌన్‌ : శాస్త్రీయ దృక్ఫథం, నాణ్యమైన విద్య, వైద్యం కావాలని జనవిజ్ఞాన వేధిక గౌరవాధ్యక్షులు డాక్టర్‌ బషీర్‌ పేర్కొన్నారు. స్థానిక సీతారామయ్య జూనియర్‌ కళాశాలలో జేవీవీనాయకులు పీపుల్స్‌ మేనిపెస్టోను విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం, భావితరాల ఉజ్వలభవిష్యత్తుకోసం, ప్రజలపక్షాన జేవీవీ పీపుల్స్‌ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను సాధారణ ఎన్నికలలో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వ వ్యవహారాలను మతం నుంచి వేరుచేయాలని, సైన్స్‌ను శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించే విధంగా రాబోయే ప్రభుత్వాలు ఉండాలని అన్నారు. అనంతరం జేవీవీ జిల్లా ప్రధానకార్యదర్శి డాక్టర్‌ ఆదిశేషు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలని, రాజ్యాంగ పరిరక్షణ, ఎన్నికల కమిషన్‌, సీబీఐ, ఈడీలాంటి సంస్థలను నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా పనిచేసేలా బలమైన చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ సీతారామయ్య, జేవీవీనాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, నరేంద్రబాబు, లోకేశ్‌, పర్వతయ్య, సురేశశ్‌, ఖలందర్‌, ప్రసాద్‌, నరేంద్ర, గంగాధర్‌, నారపరెడ్డి పాల్గొన్నారు.

➡️