ఊపొందుకున్న ఎన్నికల ప్రచారం

Mar 28,2024 12:23 #srikakulam

ప్రజాశక్తి-బూర్జ : ఎప్పుడు ఎప్పుడు అనుకున్నా ఎదురుచూసే సాధారణ ఎన్నికలు రానే వచ్చే వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేయడం మొదలెట్టారు. దీనిలో భాగంగానే బూర్జ మండలం పెద్ద పేట పంచాయతీ మదనాపురంలో తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు ఉమ్మడి అభ్యర్థి కోన రవికుమార్ గురువారం పర్యటించారు. దీనిలో ఇంటింటికి కరపత్రాలను అందించి తెదేపా విజయానికి కారణం కావాలని కోరారు. ఆయన వెంట నియోజవర్గ జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్, భాజపా నాయకులు పేడాడ సూర నాయుడు, మాజీ ఎమ్మెల్సీ పీర్ గట్ల విశ్వప్రసాదరావు, జడ్పిటిసి మాజీ సభ్యులు ఆమెకు రామకృష్ణ, రేపు నాయకులు మొదలవలస రమేష్ తెదేపా మండల అధ్యక్షుడు వావిలిపల్లి సీతారాం బాబు రాంజీ పాల్గొన్నారు.

➡️