అస్వస్థతకు గురైన దుప్పి మృతి 

Mar 21,2024 14:00 #srikakulam
Moose died due to illness

ప్రజాశక్తి-టెక్కలి రూరల్ : శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తేలినీలాపురం విదేశీ పక్షుల విడిది కేంద్రంలో గురువారం ఒక చుక్కల దుప్పి మృతి చెందింది. కొద్దిరోజుల క్రితం నందిగం మండలం రాంపురం సమీపంలోని తెట్టంగి పంట పొలాల్లో ఇరుక్కున్నదుప్పిని గ్రామస్థుల సమాచారంతో అటవీ
శాఖ అధికారులు తేలినీలాపురం విడిది కేంద్రంలో ఉంచారు. ఈ క్రమంలో గురువారం దుప్పి అస్వస్థతకు గురై మృతి చెందింది. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని ఆరోపణలు వస్తున్నాయి.

➡️